చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత | 23 KG Gold Seized In Chennai Airport | Sakshi
Sakshi News home page

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

Jun 10 2019 3:40 PM | Updated on Jun 10 2019 3:49 PM

23 KG Gold Seized In Chennai Airport - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్‌ అధికారులు దాదాపు 8 కోట్ల రూపాయలు విలువ చేసే 23 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలింపుకు పాల్పడుతున్న సింగపూర్‌, మలేసియా నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బంగారం అక్రమ తరలింపు వెనక ఇంకా ఎవరైన ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement