హైదరాబాద్‌లో 19 ఏళ్ల యువతి అదృశ్యం | 19 Year Old Woman Missing In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 19 ఏళ్ల యువతి అదృశ్యం

Dec 19 2019 5:42 PM | Updated on Dec 19 2019 6:48 PM

19 Year Old Woman Missing In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మార్కెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఓ 19 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్‌ పీఎస్‌ పరిధిలోని మల్లంపేట్‌కు చెందిన గాయత్రి(19) తను పనిచేసే సూపర్‌ మార్కెట్‌కు వెళ్తున్నానని బుధవారం మధ్యాహ్నాం ఇంటి నుంచి బయలు దేరింది. సాయంత్రం అయినా యువతి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెలికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement