24న తిరుమల వెళ్తున్నారా.. ఇది గమనించండి

TTD cancelled Special entry darshan on ratha saptami - Sakshi

సాక్షి, తిరుమల: రథసప్తమి పర్వదినం సందర్భంగా జనవరి 24న తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు.. చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, ఎన్నారైలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.

సూర్యజయంతిని పురస్కరించుకుని స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగుతారు. అందుకే తిరుమలలో రథసప్తమిని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉపబ్రహ్మోత్సవాలని వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

సమయం    వాహనం
ఉ. 5.30 - ఉ. 08.00     సూర్యప్రభ వాహనం
ఉ. 9.00 - ఉ. 10.00     చిన్నశేష వాహనం
ఉ. 11.00 - మ. 12.00     గరుడ వాహనం
మ. 1.00 - మ. 2.00     హనుమంత వాహనం
మ. 2.00 - మ. 3.00     చక్రస్నానం
సా. 4.00 - సా. 5.00   కల్పవృక్ష వాహనం
సా. 6.00 - సా. 7.00     సర్వభూపాల వాహనం
రా. 8.00 - రా. 9.00     చంద్రప్రభ వాహనం
Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top