31న శ్రీవారి ఆలయం మూత 

ఆ రోజు అన్ని ఆర్జితసేవలు  రద్దు 

సాక్షి, తిరుమల:  చంద్రగ్రహణం కారణంగా ఈనెల 31వ తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 5.18 గంటలకు  చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తికానుంది.

గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితి. గ్రహణం తర్వాత రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించనున్నారు. రాత్రి 10.30 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. 31న ఆర్జితసేవలైన సహస్రకలశాభిషేకం, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top