చౌక ధరకే.. ఐఫోన్‌ 8! | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ 8 కేవలం రూ.31వేలే!

Published Thu, Sep 28 2017 6:05 PM

You Can Get iPhone 8 for just Rs.31,100 on Flipkart - Sakshi

ఆపిల్‌ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో రేపటి నుంచి విక్రయానికి రాబోతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను ముఖేష్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ రేపు నావి ముంబైలోని లాంచ్‌ చేయబోతున్నారు. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెజాన్‌, రిలయన్స్‌ జియోలు ఈ రెండు హ్యాండ్‌సెట్లపై ఇప్పటికే ధరలను తగ్గించినట్టు ప్రకటించగా... తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ కూడా వీటి జాబితాలో చేరిపోయింది. ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఐఫోన్‌ 8 బేస్‌ మోడల్‌ను అత్యంత తక్కువకు రూ.31,100కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా రూ.40,100కు తగ్గించింది.

ఐఫోన్‌ 8 ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ను రూ.23 వేల వరకు అందిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్‌ 7 ఉండి ఉంటే, దాన్ని కొత్త దానితో అప్‌గ్రేడ్‌ చేసుకుంటే, ధరపై రూ.20వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్‌ 7 ప్లస్‌తో ఎక్స్చేంజ్‌ చేసుకుంటే రూ.23వేల డిస్కౌంట్‌ లభించనుంది. దీంతో ఐఫోన్‌ 7ప్లస్‌తో ఎక్స్చేంజ్‌ చేసుకున్న వారికి రూ.64వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్‌ 8(64జీబీ వేరియంట్‌) రూ.41వేలకే లభ్యం కానుంది. పాత హ్యాండ్‌సెట్‌ను తీసుకున్నందుకు పికప్‌ ఛార్జీలుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సిటీ క్రెడిట్‌ లేదా వరల్డ్‌ డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే, మరో 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. అయితే ఈ ఆఫర్‌ కార్పొరేట్‌ కార్డులకు అందుబాటులో ఉండదు. ఈ ఆఫర్‌ కూడా ప్రీ-ఆర్డర్‌ లావాదేవీలకు సెప్టెంబర్‌ 29 సాయంత్రం 5:59 వరకు మాత్రమే వాలిడ్‌లో ఉండనుంది. 2017 డిసెంబర్‌ 30 కంటే వరకు ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తం అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లన్నింటిన్నీ తీసుకుంటే, ఐఫోన్‌ 8 బేస్‌ వేరియంట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,100కు, ఐఫోన్‌ 8 ప్లస్‌ బేస్‌ వేరియంట్‌ రూ.40,100కు లభ్యం కానున్నాయి. అదేవిధంగా 256జీబీ ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ వేరియంట్లు కూడా రూ.44,100కు, రూ.53,100కు కొనుగోలుచేసుకోవచ్చు.

ఈ ఫోన్లను కొనుగోలు చేసే అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సిటీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కొటక్‌ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, స్టాండర్డ్‌ ఛార్టడ్‌, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంకుల వినియోగదారులకు 12 నెలల పాటు నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. అమెజాన్‌ కూడా ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై రూ.12,100 వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. రిలయన్స్‌ జియో కూడా సిటీ బ్యాంకు కార్డులపై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. క్యాష్‌బ్యాక్‌తో పాటు బైబ్యాక్‌ గ్యారెంటీని ప్రకటించింది. 

Advertisement
Advertisement