యస్ బ్యాంక్తో క్లిక్ అండ్ పే ఒప్పందం | YES BANK partners with Click&pay | Sakshi
Sakshi News home page

యస్ బ్యాంక్తో క్లిక్ అండ్ పే ఒప్పందం

May 31 2016 1:45 AM | Updated on Sep 4 2017 1:16 AM

యస్ బ్యాంక్తో క్లిక్ అండ్ పే ఒప్పందం

యస్ బ్యాంక్తో క్లిక్ అండ్ పే ఒప్పందం

తెలంగాణ హబ్ పోర్ట్‌ఫోలియో కంపెనీ అయిన క్లిక్ అండ్ పే, ప్రైవేట్ రంగలోని యస్ బ్యాంక్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్: తెలంగాణ హబ్ పోర్ట్‌ఫోలియో కంపెనీ అయిన క్లిక్ అండ్ పే,  ప్రైవేట్ రంగలోని యస్ బ్యాంక్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. నగదు రహిత లావాదేవీలకు మొబైల్ ఆధారిత చెల్లింపు సొల్యూషన్లు అందించే తాము యస్‌బ్యాంక్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని క్లిక్ అండ్ పే ఒక ప్రకటనలో తెలిపింది. భద్రమైన, సౌకర్యవంతమైన నగదు రహిత లావాదేవీలను వినియోగదారులకు అందించడానికి  ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని క్లిక్ అండ్ పే వ్యవస్థాపకుల్లో ఒకరైన సాయి సందీప్ పేర్కొన్నారు. ఈ  ఒప్పందంలో భాగంగా యస్‌బ్యాంక్ మొబైల్ వాలెట్లను జారీ చేస్తామని వివరించారు. మరోవైపు డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపులు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయని యస్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ రితేశ్ పాయ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement