స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రారాజు ఎవరంటే?

Xiaomi on top, Samsung second in India’s smartphone market, according to IDC data - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి తానే కింగ్‌నంటూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌  బ్రాండ్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) డేటా ప్రకారం వరుసగా నాల్గవసారి కూడా తన అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకుంది. 2018 రెండవ త్రైమాసికంలో దేశంలో 29.7 శాతం వాటాతో ఈ ఘనతను దక్కించుకుంది.  107.6 శాతం వృద్ధితో కోటి స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విక్రయించింది. అలాగే ఆన్‌లైన్‌ మార్కెట్‌లో కూడా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సెగ్మెంట్‌లో షావోమి 55.6 శాతం  వాటా కైవసం చేసుకుంది.  ఆన్‌లైన్‌ మార్కెట్‌లో వరుసగా ఏడవ క్వార్టర్‌లో ఈ ఘనతను సాధించింది. ఈ క్వార్టర్లో  రెడ్‌ మీ 5ఏ, రెడ్‌ మి నోట్‌ ప్రో, రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5  డివైస్‌ల టాప్‌ విక్రయాలతో ఈ రికార్డును దక్కించుకుంది. 
 
అయితే శాంసంగ్‌ మాత్రం రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 23 శాతం మార్కెట్‌ షేర్‌తో  80 లక్షల స్మార్ట్‌ఫోన్లను  షిప్‌మెంట్‌ చేసింది. ఐడిసి ప్రకారం, భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 20శాతం వృద్ధిని సాధించింది.  4.2 మిలియన్ల  యూనిట్లు,  12.6 శాతంతో వివో మూడవ స్థానానంలో నిలిచింది. కాగా భారత మార్కెట్లోకి  మొత్తం 33.5 మిలియన్ యూనిట్లు వచ్చాయి బలమైన ఉత్పత్తులతో ఆన్‌లైన్‌ బ్రాండ్ విక్రయాలు, ప్రత్యేకమైన లాంచింగ్‌ల ద్వారా ఈ వృద్ది సాధించినట్టు ఐడీసి వ్యాఖ్యానించింది. 2018లో చిన్న సంస్థలతో పోలిస్తే టాప్‌ 5 బ్రాండ్స్‌ 79 శాతం విక్రయాలు సాధించాయని ఐడీసీ ఇండియా అసోసియేట్‌ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి  పేర్కొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top