షావోమీ దూకుడు:  బిగ్‌ టీవీ, బడ్జెట్‌ ధర | Xiaomi 55-inch Mi TV 4X Pro, 43-inch Mi TV 4 Pro launched in India | Sakshi
Sakshi News home page

షావోమీ దూకుడు:  బిగ్‌టీవీ, బడ్జెట్‌ధర

Jan 10 2019 2:05 PM | Updated on Jan 10 2019 7:25 PM

Xiaomi 55-inch Mi TV 4X Pro, 43-inch Mi TV 4 Pro launched in India - Sakshi




సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌టీవీ సెగ్మెంట్‌లో రారాజులో ఏలుతున్న చైనా స్మార్ట్‌ఫోన​ దిగ్గజం షావోమి  ఎంఐ తాజాగా కొత్త ఎల్ఈడీ టీవీలను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 4కె  పేరుతో వీటిని  విడుదల చేసింది. వీటితోపాటు ఎంఐ సౌండ్‌ బార్‌నుకూడా  ఆవిష్కరించింది.

20 వాట్ల స్టీరియో స్పీక‌ర్లు, గూగుల్ వాయిస్ సెర్చ్,  షావోమి సొంతమైన ప్యాచ్‌ వాల్‌ ప్రధాన ఫీచ‌ర్లుగా కంపెనీ పేర్కొంది. ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఈ టీవీల‌లో అందిస్తున్నారు. ప్లే స్టోర్‌, క్రోమ్ క్యాస్ట్‌కు స‌పోర్ట్‌, హాట్ స్టార్‌, హంగామా, సోనీ లివ్‌, వూట్‌, ఈరోస్ నౌ, జీ5, హూక్‌, ఎపిక్ ఆన్ వంటి యాప్‌లు ఇన్‌బిల్ట్‌గా ఈ స్మార్ట్‌ టీవీల్లో పొందుపర్చింది.

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ
55 అంగుళాల టీవీలో 3840 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, డీటీఎస్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి.  

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 
43 ఇంచ్ టీవీలో 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తోంది.

ధరలు:  
43 ఇంచుల టీవీ ధ‌ర రూ.22,999  
55 ఇంచుల టీవీ ధ‌ర రూ.39,999
సౌండ్‌బార్‌ ధర :  రూ. 4999
ఈ నెల 15వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీలు విక్రయానికి  విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement