వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

WhatsApp gets Dismiss as Admin and High Priority Features - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్‌ వినియోగదారులకోసం  ప్రముఖ  మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  తాజా బీటావర్షన్‌లో వాట్సాప్‌లో ఈ రెండు ఫీచర్లను జోడించింది.  ‘హై ప్రయారిటీ’, ‘ డిస్‌మిస్‌ యాజ్‌ అడ్మిన్‌’  అనే రెండు ఫీచర్లను   పబ్లిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది.   ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ వెర్షన్ 2.18.117 లో అందుబాటులో ఉందని వాట్సాప్‌ ధృవీకరించింది.

‘హై ప్రయారిటీ నోటిఫికేషన్స్’
ఇన్‌కమింగ్ నోటిఫికేషన్లు  నియంత్రించేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సెటింగ్స్‌లో వెళ్లి ఈ ఆప్షన్‌ను అప్‌డేట్‌  చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది తీసుకొచ్చిన పిన్‌డ్‌  చాట్స్‌ ఫీచర్‌లాంటిదే ఇది కూడా. ప్రయారిటీ నోటిఫికేషన్స్ పేరిట పిలువబడే ఈ సదుపాయం ద్వారా ఇకపై వాట్సప్ మెసేజ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో మిగతా అప్లికేషన్ల నోటిఫికేషన్ల కన్నా పైభాగంలో ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓ నిర్దిష్టమైన వ్యక్తి నుండి వచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఇలా ప్రత్యేకంగా కనిపించేలా, లేక అందరివీ కనిపించాలా, గ్రూప్ ఛాట్‌లు కూడా ఇలా ప్రయారిటీ నోటిఫికేషన్ల ఎంపికను మనం చేసుకోవచ్చు

అడ్మిన్లను తొలగించే ఫీచర్‌
వాట్సాప్‌ గ్రూప్స్‌ లను దృష్టిలో  పెట్టుకుని  డిస్సిస్‌ యాజ్‌ అడ్మిన్‌( అడ్మిన్‌గా డిస్సిస్‌)  ఆప్షన్‌ను అందిస్తోంది.  ఇప్పటివరకూ గ్రూపునుంచి సభ్యులను డిలీట్‌ చేసే అవకాశం అడ్మిన్లకు ఉంది. తాజాగా ఫీచర్‌తో గ్రూపులోని ఇతర అడ్మిన్లను గ్రూప్‌నుంచి  డీమోట్‌ చేసే అవకాశమన్నమాట. అంటే అడ్మిన్లను తొలగించాల్సిన అవసరం లేకుండా వారిని  డీమోట్‌ చేయొచ్చు. అంటే గ్రూప్‌ ఇన్ఫో మెనూలో అడ్మిన్‌ నంబర్‌  మనకు కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, వెబ్‌ వెర్షన్లలో ఇది  అందుబాటులో ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top