వోల్వో ‘ఎక్స్‌సీ40 టీ4’ ఎస్‌యూవీ

Volvo XC40 T4 R-Design BS6 petrol launched in India - Sakshi

ధర 39.9 లక్షలు

న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన కొత్త ఎంట్రీ లెవెల్‌ ఎస్‌యూవీ ‘ఎక్స్‌సీ40 టీ4 ఆర్‌–డిజైన్‌’ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఈ కారు ధర రూ. 39.9 లక్షలు. కంపెనీకి చెందిన కాంపాక్ట్‌ మాడ్యులర్‌ ఆర్కిటెక్చర్‌ (సీఎంఏ) ఆధారంగా రూపొందిన ఈ ఎస్‌యూవీలో 2–లీటర్‌ ఇంజిన్‌ అమర్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చార్లెస్‌ ఫ్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఎంట్రీ లెవెల్‌ ఎస్‌యూవీలో విడుదలైన తొలి పెట్రోల్‌ ఇంజిన్‌ కారు ఇది’ అని చెప్పారు.  8–స్పీడ్‌ గేర్‌బాక్స్, ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ పవర్‌ట్రైన్, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లేతో పనిచేసే 9–అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉన్నట్లు కంపెనీ వివరించింది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top