లేటెస్ట్‌ వార్‌ : ప్లాన్స్‌ అప్‌గ్రేడ్‌ | Vodafone Revises Rs. 348 Pack, Offers 2GB Data Per Day and Unlimited Calling | Sakshi
Sakshi News home page

లేటెస్ట్‌ వార్‌ : ప్లాన్స్‌ అప్‌గ్రేడ్‌

Dec 13 2017 7:37 PM | Updated on Aug 11 2018 8:24 PM

Vodafone Revises Rs. 348 Pack, Offers 2GB Data Per Day and Unlimited Calling - Sakshi

టెలికాం ఆపరేటర్ల మధ్య కొత్త రకం ధరల యుద్ధం ప్రారంభమైంది. కంపెనీలన్నీ తమ ప్యాక్‌లను అప్‌గ్రేడ్‌ చేయడం ప్రారంభించాయి. ఈ అప్‌గ్రేడ్‌లో భాగంగా రోజుకు కంపెనీలు అందించే డేటాను పెంచడం మొదలు పెట్టాయి. తాజాగా వొడాఫోన్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందిస్తున్న రూ.348 ప్యాక్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ ప్యాక్‌పై రోజుకు అందిస్తున్న 1జీబీ డేటాను 2జీబీకి పెంచింది. దీంతో 28 రోజుల పాటు మొత్తం 56జీబీ డేటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రోజుకు 2జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్‌ అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను అందించనుంది.

అయితే ఉచిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకనుకు 1పైసా ఛార్జీ విధించనుంది. రూ.348 ప్లాన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. వొడాఫోన్‌కు చెందిన ఈ ప్యాక్‌, ఎయిర్‌టెల్‌ రూ.349 ప్యాక్‌కు డైరెక్ట్‌ పోటీగా నిలుస్తోంది. ఎయిర్‌టెల్‌ కూడా రూ.349 ప్యాక్‌ కింద రోజుకు 2జీబీ 4జీ డేటాను అందిస్తోంది. వొడాఫోన్‌ ప్రస్తుతం అప్‌గ్రేడ్‌ చేసిన రూ.348 ప్యాక్‌ను ఈ కంపెనీ ఆగస్టులో లాంచ్‌ చేసింది. అత్యంత చౌకైన నెలవారీ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.176ను వొడాఫోన్‌ లాంచ్‌ చుసింది. ఈ ప్లాన్‌ కింద ఉచిత కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ 2జీ డేటాను అందిస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement