వివో వీ9 ధర తగ్గింది! | Vivo V9 Price Cut In India | Sakshi
Sakshi News home page

వివో వీ9 ధర తగ్గింది!

Jul 5 2018 2:43 PM | Updated on Jul 6 2019 3:18 PM

Vivo V9 Price Cut In India - Sakshi

వివో కంపెనీ మిడ్‌-రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ వివో వీ9 ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేల రూపాయల మేర ధర తగ్గిస్తున్నట్టు వివో ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లోకి వచ్చింది. లాంచింగ్‌ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 22,990 రూపాయలుంటే, ధర తగ్గింపు అనంతరం 20,990కు విక్రయానికి వచ్చింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, వివో ఈ-స్టోర్‌ అన్ని ఛానల్స్‌లోనూ కొత్త ధరలోనే వివో వీ9 లభ్యమవుతుంది. కేవలం ఒకే ఒక్క వేరియంట్లో భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇటీవలే కొత్త మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్‌చేసింది. ధర తగ్గింపు విషయాన్ని వివో గాడ్జెట్స్‌ 360కి ధృవీకరించింది. 
 

వివో వీ9 ఫీచర్లు
ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి డిస్‌ప్లే నాచ్‌
6.3 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత సాఫ్ట్‌వేర్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 626 ప్రాసెసర్‌
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ
24 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
16 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో రియర్‌ కెమెరా
3260 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement