వివో వి 9 ప్రొ లాంచ్‌ : స్పెషల్‌ డిస్కౌంట్‌ | Vivo launches V9 Pro in India | Sakshi
Sakshi News home page

వివో వి 9 ప్రొ లాంచ్‌ : స్పెషల్‌ డిస్కౌంట్‌

Sep 26 2018 4:53 PM | Updated on Sep 26 2018 6:39 PM

Vivo launches V9 Pro in India - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను  భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. 'వివో వి9 ప్రొ' పేరుతో ఈ డివైస్‌ను బుధవారం ఆవిష్కరించింది.  ఈ ఫోన్ ధరను రూ.19,990గా కంపెనీ ప్రకటించింది. అయితే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో  రూ. 2వేల డిస్కౌంట్‌తో 17,999లకే లభ్యం కానుంది. ఈ  సేల్‌ ముగిసిన అనతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంఆర్‌పీ ధర 19,990గా ఉంటుంది. 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో విడుదలైన ఈ ఫోన్లను అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా భారత్‌లో విక్రయించనున్నారు. మరోవైపు షావోమీ ఎ2, నోకియా 7ప్లస్ ఫోన్లకు  వివో వి9 ప్రొ  గట్టిపోటీ ఇవ్వనుందని అంచనా.

వివో వి9 ప్రొ ఫీచర్లు
6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
2280 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
6 జీబీ  ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్
13, 2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
3260 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement