భారత్‌లో సోలార్ పార్కుల ఏర్పాటుకు గానూ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్
యూఎస్‌ఏఐడీ, ఏడీబీ మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: భారత్‌లో సోలార్ పార్కుల ఏర్పాటుకు గానూ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇవి రెండు క్లీన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా భారత్‌లో సోలార్ పార్కుల అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం భారత్‌కు రూ.5,681 కోట్లు అందించనున్నాయి.