
తెలుగు రాష్ట్రాల ఇండియన్ ఆయిల్ బిజినెస్ హెడ్‌గా సింగ్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న యూ.పి.సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో...
హైదరాబాద్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న యూ.పి.సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బిజినెస్ హెడ్‌గా బాధ్యతలను చేపట్టారు. ఆయనకు సంస్థ వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో అపార అనుభవం ఉంది. సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బిజినెస్ హెడ్‌గా పనిచే శారు. ఆయన రాంచీలోని బిట్స్‌లో మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ (మానవ వనరులు) పూర్తిచేశారు.