రెండింతలైన ఎస్కార్ట్స్‌లాభం

Twofold escorts gain - Sakshi

వ్యవసాయ సంబంధిత యంత్రాల తయారీ కంపెనీ ఎస్కార్ట్స్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో రెండు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.59 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.113  కోట్లకు పెరిగిందని ఎస్కార్ట్స్‌ తెలిపింది.

ఆదాయం రూ.1,044 కోట్ల నుంచి 41% వృద్ధితో రూ.1,436 కోట్లకు పెరిగిందని  తెలిపారు.  రూ.10 ముఖ విలువ గల షేర్‌కు రూ.2 డివిడెండ్‌ ఇవ్వనున్నామని తెలిపింది. ఇక 2016–17లో రూ.131 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లకు మించి రూ.347 కోట్లకు పెరిగిందని నందా తెలిపారు. ఆదాయం రూ.4,220 కోట్ల నుంచి రూ.5,080 కోట్లకు ఎగసిందని వివరించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top