సాహస మహిళకు గుర్తుగా స్పెషల్.. | TVS Motor launches Scooty Zest Special Edition | Sakshi
Sakshi News home page

సాహస మహిళకు గుర్తుగా స్పెషల్..

May 15 2016 12:11 PM | Updated on Sep 4 2017 12:10 AM

సాహస మహిళకు గుర్తుగా స్పెషల్..

సాహస మహిళకు గుర్తుగా స్పెషల్..

ఓ మహిళా సాహస యాత్రకు ప్రతీకగా దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారి టీవీఎస్ మోటార్ స్కూటీ జెస్ట్ నుంచి ఓ స్పెషల్ ఎడిషన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఓ మహిళా సాహస యాత్రకు ప్రతీకగా దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్ మోటార్ స్కూటీ జెస్ట్ నుంచి ఓ స్పెషల్ ఎడిషన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ కు, హిమాలయన్ హైస్ స్పెషల్ ఎడిషన్ గా పేరుపెట్టింది. హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన పర్వతం కర్దంగ్ లాను అనామ్ హాసిమ్ జయించడంతో ఈ ప్రత్యేక ఎడిషన్ ను టీవీఎస్ మోటార్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.46,113గా ఉంటుందని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. టీవీఎస్ తీసుకొచ్చిన స్కూటీ జెస్ట్ 110 హిమాలయన్ హైస్, ప్రత్యేకంగా హిమాలయన్ హై బ్రౌన్ కలర్, న్యూ టేప్ సెట్, బాడీ కలర్ మిర్రర్స్, స్విచ్ఛ్ ప్యానెల్ ను కవర్ చేస్తూ బాడీ కలర్ దీనిలో ప్రత్యేకతలు.

మొదటిసారిగా ఒక స్కూటర్ లో అనామ్ హాసిమ్ అనే మహిళా రైడర్ హిమాలయాల్లో ఉన్న ఎత్రైన ప్రదేశానికి రైడింగ్ ద్వారా వెళ్లింది. సముద్ర మట్టానికి 18,380 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి అనామ్ హాసిమ్ టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్ లో చేరుకుంది. జమ్మూ, శ్రీనగర్, కార్గిల్, లెహ్, కార్డంగ్ లాను దాటి చాంగ్ లా నుంచి పెన్ గంగా వరకు ఆమె ఈ స్కూటీపైనే ప్రయాణించింది. అంతా దూరం టీవీఎస్ స్కూటీపై ప్రయాణించిన ఆమె రైడింగ్ లో రికార్డు బద్దలు కొట్టింది. ఈ సాహసానికి గౌరవార్థంగా టీవీఎస్ మోటార్స్ స్కూటీ జెస్ట్ స్కూటార్ ను లిమిటెడ్ ఎడిషన్ గా స్కూటీ జెస్ట్ హిమాలయన్ హైస్ పేరుతో విడుదల చేసింది. 

'బండి నడపడం నా ప్యాషన్. కొత్త లక్ష్యాలను చేధించడంలో నేను ఆనందం పొందుతాను. కర్దంగ్ లా వరకు టీవీఎస్ స్కూటీ జెస్ట్ పై ప్రయాణించడం ఓ మరువలేని అనుభూతి. ఇంజిన్ లో ఎక్కడ కూడా నాకు సమస్యలు తలెత్తలేదు. 10వేల అడుగుల ఎత్తులో కూడా ఎలాంటి సమస్య రాలేదు. అయితే కొన్ని ప్రమాదకరమైన మలుపుల్లో, భయంకరమైన వాతావరణంలో, ఈ రికార్డును బ్రేక్ చేయడం నిజంగా చరిత్రాత్మక విజయం' అని ఆమె తెలిపింది. 110సీసీ స్కూటర్ ల్లో అత్యంత ఎత్తైన రహదారిని జయించిన మొదటి స్కూటీ ఇదేనని టీవీఎస్ మోటార్ పేర్కొంది. హిమాలయన్ హైస్ స్పెషల్ ఎడిషన్ ను ప్రారంభించడం చాలా ఆనందాయకంగా ఉందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement