కష్టకాలంలో టెలికాం ఉద్యోగులు : 30వేల జాబ్స్‌ కట్‌ | Tough times ahead for telecom employees; up to 30,000 face axe  | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో టెలికాం ఉద్యోగులు : 30వేల జాబ్స్‌ కట్‌

Nov 3 2017 8:53 AM | Updated on Nov 3 2017 2:22 PM

Tough times ahead for telecom employees; up to 30,000 face axe  - Sakshi

బెంగళూరు :  టెలికాం రంగం మరింత కష్టకాంలో పడబోతుంది. ఈ రంగంలో చోటుచేసుకున్న కన్సాల్డిషన్‌ ప్రభావంతో ఉద్యోగాలు పోయే సంఖ్య అంతకంతకు పెరుగనుందని ప్లేస్‌మెంట్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. వచ్చే ఏడాదికి ఈ ప్రక్రియ మరింత విస్తరించనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. అన్ని కేటగిరీల్లోని స్థానాలు కూడా ఈ జాబ్‌ లాస్‌కి ప్రభావితం కానున్నాయని ప్లేస్‌మెంట్‌ సంస్థలు తెలిపాయి. వీరికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలున్నప్పటికీ, ఉద్యోగులు తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని, అయినప్పటికీ తక్కువ వేతనాలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఓ వైపు రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ తన వైర్‌లెస్‌ వ్యాపారాలను మూసివేయాలని నిర్ణయించింది. మరోవైపు టాటా గ్రూప్‌, తన మొబైల్‌ వ్యాపారాలను భారతీ ఎయిర్‌టెల్‌కు అమ్మేస్తోంది. 

ఈ నేపథ్యంలో వచ్చే 12 నెలల కాలంలో 20 వేల నుంచి 30 వేల వరకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, మాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వీసెస్‌, ఏబీసీ కన్సల్టెంట్స్‌, ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా, కార్న్‌ ఫెర్రీ సంస్థలు అంచనావేస్తున్నాయి. కంపెనీల్లో మౌలిక సదుపాయాలు, నెట్‌వర్కింగ్‌ ఇంజనీరింగ్‌, సేల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌, టెలికాం ఇంజనీరింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, కాల్‌ సెంటర్‌, ఇతర సపోర్టు బాధ్యతలు నిర్వర్తించే వారు ప్రమాదంలో పడనున్నట్టు విశ్లేషకులు చెప్పారు. వీరిలో కూడా ఎక్కువగా ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌, సేల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ విభాగం వారికే ఉంటుందని తెలిపారు. మధ్య, కింద స్థాయి ఉద్యోగులను తీసివేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే టెలికాం రంగం రూ.8 లక్షల కోట్ల రుణాలతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు రిలయన్స్‌ జియో దెబ్బకు, కంపెనీలన్నీ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement