కాఫీ డే ఐపీఓకు సెబీ అనుమతి | To Coffee Day SEBI is allowed to IPO | Sakshi
Sakshi News home page

కాఫీ డే ఐపీఓకు సెబీ అనుమతి

Aug 18 2015 12:12 AM | Updated on Sep 3 2017 7:37 AM

కాఫీ డే ఐపీఓకు సెబీ అనుమతి

కాఫీ డే ఐపీఓకు సెబీ అనుమతి

కేఫ్ కాఫీ డే చెయిన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది...

ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ:
కేఫ్ కాఫీ డే చెయిన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరించాలని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ యోచిస్తోంది. ఈ ఐపీఓ నిధులతో రూ.632 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకుంటామని, కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తామని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంటోంది. కాగా సెబీ ఇప్పటిదాకా ఐపీఓకు అనుమతిచ్చిన కంపెనీల సంఖ్య 25కు పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement