హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఎదగాలనే ఆకాంక్ష గల హైదరాబాదీ స్టార్టప్ సంస్థలకు ఊతం ఇచ్చేందుకు ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ విభాగం గురువారం బిలియన్ డాలర్ బేబీస్ ప్రాజెక్టును ఆవిష్కరించింది. బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదిగే సత్తా ఉన్న భారతీయ సంస్థలను గుర్తించి, ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని ఈ సందర్భంగా టై సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ వెంకటేష్ శుక్లా తెలిపారు.
దీని కింద ఎంపికైన దేశీ స్టార్టప్స్‌కు టై సిలికాన్ వ్యాలీకి చెందిన వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులు మొదలైన వారి నుంచి వ్యాపార మెళకువలు తదితర అంశాలపై తోడ్పాటు లభించగలదని శుక్లా పేర్కొన్నారు. అలాగే, టై సీఐవో ఫోరం మొదలైన వాటిల్లో పాల్గొనవచ్చని.. అకౌంటింగ్, చట్టాలు, హైరింగ్, మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ సహాయ, సహకారాలు లభిస్తాయన్నారు. నూతనంగా కంపెనీలను ఏర్పాటు చేసుకునే వారికి బిలియన్ డాలర్ బేబి ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు.
హైదరాబాద్ యువత వద్ద వినూత్న వ్యాపార ఐడియాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రాజెక్టులో పాల్గొనే ఇతర స్టార్టప్స్‌కి గట్టినివ్వగలరని టై హైదరాబాద్ విభాగం ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం తెలిపారు. హైదరాబాద్‌లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోండటం హర్షణీయమని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా ఎదగాలనుకునే దేశీ తయారీ సంస్థలు ఈ ప్రాజెక్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి ఇప్పటికే వెంచర్/ఏంజెల్ ఫండింగ్ పొంది ఉండటంతో పాటు .. ఇటు దేశీయంగాను.. అటు విదేశాల్లోనూ చెప్పుకోతగిన ఫలితాలు సాధించి ఉండాలి. కంపెనీ సహ-వ్యవస్థాపకుల్లో ఎవరో ఒకరు సిలికాన్ వ్యాలీలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడే ఉండాల్సి ఉంటుంది.
స్టార్టప్స్ కోసం ‘బిలియన్ డాలర్ బేబీస్’
Published Fri, Dec 19 2014 1:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement