మెర్సిడెస్ నుంచి మూడు లగ్జరీ కార్లు | Three luxury cars from Mercedes | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ నుంచి మూడు లగ్జరీ కార్లు

Jul 31 2015 7:34 AM | Updated on May 24 2018 2:36 PM

మెర్సిడెస్ నుంచి మూడు లగ్జరీ కార్లు - Sakshi

మెర్సిడెస్ నుంచి మూడు లగ్జరీ కార్లు

అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ... జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ గతంలో ఎన్నడూ లేనివిధంగా

న్యూఢిల్లీ : అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ... జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు మూడు కొత్త కార్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఎస్ 500 కూపే, ఏఎంజీ ఎస్ 63 కూపే, ఏఎంజీ జీ 63 ‘క్రేజీ కలర్’ ఎడిషన్ కార్లను వినియోగదారుల కోసం మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ధర  రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల (ఢిల్లీ ఎక్స్ షోరూం) మధ్యలో ఉంది. ఎస్500 కూపే ధర రూ.2 కోట్లుగా, ఏఎంజీ ఎస్ 63 కూపే ధర రూ.2.60 కోట్లుగా, ఏఎంజీ జీ 63 ‘క్రేజీ కలర్’ ఎడిషన్ ధర రూ.2.17 కోట్లుగా ఉంది.

2015లో 15 మోడళ్లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించాలనే ‘15 లో 15’ వ్యూహంలో భాగంగానే ఈ కార్లను మార్కెట్‌లోకి తె చ్చినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే కంపెనీ వినియోగదారుల కోసం ‘డిజైనో’ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నచ్చిన ప్రత్యేక రంగు, హై క్వాలిటీ ఇంటీరియర్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు వంటి తదితర ఆప్షన్లను అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement