వైజాగ్‌లో టీఎల్‌టీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన | The foundation stone for the project in Vizag TLT | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో టీఎల్‌టీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

Aug 22 2015 2:14 AM | Updated on Sep 3 2017 7:52 AM

వైజాగ్‌లో టీఎల్‌టీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

వైజాగ్‌లో టీఎల్‌టీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

విశాఖ స్టీల్‌ప్లాంట్, పవర్‌గ్రిడ్‌లు సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్స్(టీఎల్‌టీ) ప్రాజెక్ట్‌కు శుక్రవారం శంకుస్థాపన జరిగింది

ఉక్కునగరం(విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్, పవర్‌గ్రిడ్‌లు సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్స్(టీఎల్‌టీ) ప్రాజెక్ట్‌కు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఆర్‌ఐఎన్‌ఎల్, పవర్‌గ్రిడ్ టిఎల్‌టి ప్రైవేట్ లిమిటెడ్ 50:50 భాగస్వామ్యంలో టీఎల్‌టీల ఉత్పత్తిపై గతంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి 1.20 లక్షల టన్నుల టీఎల్‌టీలను ఉత్పత్తి చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్ బీసీ గేటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ పనులకు స్టీల్‌ప్లాంట్ సిఎండి పి.మధుసూదన్, పవర్ గ్రిడ్ సిఎండి ఆర్.ఎన్.నాయక్‌లు శంకుస్దాపన చేశారు.

ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ప్రస్తుత వాణిజ్య పరిస్థితుల్లో ఇటువంటి సంయుక్త భాగస్వామ్య సంస్థలు ఏర్పాటు ఆవశ్యకమన్నారు.  పవర్‌గ్రిడ్ సిఎండీ నాయక్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఏడాదిలోగా పూర్తయ్యి ఉత్పత్తి ప్రారంభించడం ఇరుసంస్దలకు లాభదాయకమన్నారు. కార్యక్రమంలో విశాఖ ఉక్కు డైరక్టర్లు పి.సి.మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, డి.ఎన్.రావులు, పవర్‌గ్రిడ్ డైరక్టర్లు ఐ.ఎస్.ఝా, ఆర్.పి. శశ్మాల్, మెకాన్ డైరక్టర్ దీపక్ దత్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement