భారత సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్, సెర్నోవ ఫైనాన్షియల్ కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
లండన్: భారత సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్, సెర్నోవ ఫైనాన్షియల్ కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. తర్వాతి తరం క్లౌడ్ ఆధారిత డెరివేటివ్ పోస్ట్ ట్రేడ్ ప్రాసెసింగ్ సర్వీస్‌ను అందించడం కోసం ఈ సంస్థలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మారుతున్న అంతర్జాతీయ నియమనిబంధనలకు అనుగుణంగా ఉంటూనే నష్ట భయాన్ని తగ్గించే ఈ సర్వీస్ బ్యాంక్‌లకు, వ్యవస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లకు ప్రయోజనకరమని సెర్నోవ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వెంకట్ రామసామి చెప్పారు.
వ్యయాలు, నిబంధనల పాటింపు, నష్ట భయం- ఈ మూడు విషయాల్లో సమతౌల్యం పాటించడంతో పాటు ఈ సేవలను వినియోగించుకోవడం వల్ల బ్యాంక్‌లకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) సుశీల్ వాసుదేవన్ చెప్పారు.