యూరప్‌లో టాటా స్టీల్ ఆస్తుల విక్రయం | Tata Steel in talks with Swiss group to sell European assets | Sakshi
Sakshi News home page

యూరప్‌లో టాటా స్టీల్ ఆస్తుల విక్రయం

Oct 16 2014 1:42 AM | Updated on Sep 2 2017 2:54 PM

యూరప్‌లో టాటా స్టీల్  ఆస్తుల విక్రయం

యూరప్‌లో టాటా స్టీల్ ఆస్తుల విక్రయం

యూరోపియన్ కార్యకలాపాలకు చెందిన లాంగ్ స్టీల్ ప్రొడక్ట్‌ల విభాగాన్ని విక్రయించేందుకు క్లెష్ గ్రూప్‌తో టాటా స్టీల్ అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది.

స్విస్ గ్రూప్‌తో కుదిరిన ఒప్పందం
న్యూఢిల్లీ: యూరోపియన్ కార్యకలాపాలకు చెందిన లాంగ్ స్టీల్ ప్రొడక్ట్‌ల విభాగాన్ని విక్రయించేందుకు క్లెష్ గ్రూప్‌తో టాటా స్టీల్ అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీంతో యూరప్‌లోని లాంగ్ ప్రొడక్ట్‌ల బిజినెస్‌తోపాటు, పంపిణీ విభాగాలు స్విట్జర్లాండ్‌కు చెందిన క్లెష్ గ్రూప్ సొంతంకానున్నాయి. దీనిలో భాగంగా 6,500 మంది ఉద్యోగులు సైతం బదిలీకానున్నారు. ఎంవోయూ ద్వారా లాంగ్ ప్రొడక్ట్‌ల బిజినెస్ విక్రయించే అవకాశాలపై పూర్తిస్థాయి పరిశీలన, చర్చలు చేపట్టనున్నట్లు టాటా స్టీల్ యూరోపియన్ కార్యకలాపాల సీఈవో కార్ల్ కోలెర్ చెప్పారు.

ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్, జర్మనీ కార్యకలాపాలతోపాటు యూకేలోని టీసైడ్, స్కాట్లాండ్‌లోని డాల్‌జెల్, క్లయిడ్‌బ్రిడ్జ్, యార్క్‌లోని రైల్ కన్సల్టెన్సీ తదితర ఆస్తులను టాటా స్టీల్ విక్రయించనుంది.  కాగా, 2007లో బ్రిటన్‌కు చెందిన కోరస్ గ్రూప్‌ను కొనుగోలు చేయడం ద్వారా టాటా స్టీల్ యూరోపియన్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement