
అనురాగ్ యూనివర్సిటీ, ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా.. ఎంఎస్ఎన్ ఉద్యోగుల కోసం అనురాగ్ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన బ్రిడ్జ్ కోర్సు (MSN Labs Bridge Course) నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, అతిథుల స్వాగతంతో ప్రారంభమైంది. అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ హెడ్, కార్యక్రమ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ సవితా బెల్వాల్, సెల్ఫ్-డైరెక్టెడ్ టీమ్స్ (SDT) బ్రిడ్జ్ కోర్సు గురించి వివరించారు. ఈ కోర్సును MSN ల్యాబ్స్‌తో కలిసి ఉద్యోగుల జ్ఞానం, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ధ్యేయంగా రూపొందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సవితా బెల్వాల్ మాట్లాడుతూ.. "ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌తో కుదుర్చుకున్న ఈ అవగాహన ఒప్పందం పరిశ్రమ-విద్యాసంస్థల సహకారానికి ఒక బలమైన ఉదాహరణ. ఈ బ్రిడ్జ్ కోర్సు ద్వారా, మేము శిక్షణ పొందుతున్నవారికి సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు, ఆచరణాత్మక నైపుణ్యాలను కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా వారు పరిశ్రమ అవసరాలకు సిద్ధమయ్యేలా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా తీర్చిదిద్దుతాం. ఫార్మా రంగంలోని వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశ్రమ, విద్యాసంస్థలు నిరంతరం ఒకదాని నుంచి మరొకటి నేర్చుకునే నమూనాను సృష్టించడమే మా లక్ష్యం" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమకు సంబంధించిన శిక్షణా మాడ్యూళ్లను రూపొందించడం, లెక్చర్లు, ల్యాబొరేటరీ సెషన్లను నిర్వహించడం, శిక్షణ పొందుతున్నవారి పురోగతిని, మూల్యాంకనాలను పర్యవేక్షించడం వంటివి చేస్తుంది.
ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ హెచ్ఆర్ (ఏపీఐ) హెడ్ అయిన కె. ఎల్. ఎన్. మూర్తి మాట్లాడుతూ.. "భారతదేశంలో ఫార్మా ప్రతిభను అభివృద్ధి చేయడానికి అనురాగ్ యూనివర్శిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థతో భాగస్వామ్యం అవసరం అని మేము బలంగా భావించాం. ఈ సహకారం మా నూతన ఉద్యోగులు సరైన సైంటిఫిక్ పరిజ్ఞానం, ఆచరణాత్మక శిక్షణ, సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యాలతో తమ వృత్తి జీవితంలో సులభంగా ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని మనం కలిసి తయారు చేస్తున్నాం" అని పేర్కొన్నారు.
అనురాగ్ యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్, పరీక్షల విభాగం, విద్యార్థి వ్యవహారాల డీన్స్‌తోపాటు ఎల్ అండ్ డీ (లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్) డైరెక్టర్ అయిన జావిద్ జమాల్ సమావేశంలో ప్రసంగించారు. పరిశ్రమకు సిద్ధంగా ఉండే నిపుణులను తయారు చేయడంలో విద్యాపరమైన తోడ్పాటు ఎంత ముఖ్యమో వారు తమ ప్రసంగంలో నొక్కి చెప్పారు.
ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌తో కుదుర్చుకున్న ఈ అవగాహన ఒప్పందం ఫార్మా రంగంలో అనురాగ్ యూనివర్శిటీకి రెండో ముఖ్యమైన సహకారం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య దీర్ఘకాలిక సమన్వయాన్ని పెంపొందించడానికి యూనివర్శిటీ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి విద్యార్థులకు, శిక్షణ పొందుతున్నవారికి ఆచరణాత్మక నైపుణ్యాలు, అనుభవం, ఫార్మా కెరీర్‌లలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి.