
పాకిస్తాన్‌లోని కీలకమైన ఖనిజాలకు సంబంధించి.. పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్, యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
"ఈరోజు ప్రధాన మంత్రి నివాసంలో పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO)తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేయడానికి యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ (USSM) నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఇస్లామాబాద్ రాయబార కార్యాలయం యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జాచ్ హార్కెన్‌రైడర్ వచ్చారు" అని ప్రకటన పేర్కొంది.
"అమెరికా భద్రత, శ్రేయస్సుకు కీలకమైన ఖనిజ వనరుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ పరిపాలనలో ఇటువంటి ఒప్పందాలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్‌లోని కీలకమైన ఖనిజాలు.. మైనింగ్ రంగంలో యూఎస్ కంపెనీలు, వాటి సహచరుల మధ్య భవిష్యత్తులో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కూడా మేము ఎదురుచూస్తున్నాము" అని ఛార్జ్ డీ అఫైర్స్ నటాలీ బేకర్ అన్నారు.
ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
యూఎస్ఎస్ఎమ్ అనేది మిస్సోరిలో ఉన్న ఒక సంస్థ. ఇది కోబాల్ట్, నికెల్, రాగి, లిథియం వంటి కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, రీసైక్లింగ్ చేయడం వంటివి చేస్తుంది. ఈ ఖనిజాలను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ.. వివిధ సాంకేతిక పరిజ్ఞానాలలో తమకు అవసరమైనవిగా లేబుల్ చేసుకుంటుంది.
Excited to see U.S. companies like USSM deepening economic ties with Pakistan! USSM’s visit to Islamabad marks an important milestone as they sign an MOU to collaborate on critical minerals production. A forward-looking partnership with great potential for both nations. -NB…
— U.S. Embassy Islamabad (@usembislamabad) September 8, 2025