టీసీఎస్కు భారీ ఫైన్.. | Tata Consultancy slapped with $940-mn fine by US court | Sakshi
Sakshi News home page

టీసీఎస్కు భారీ ఫైన్..

Apr 16 2016 5:57 PM | Updated on Oct 2 2018 4:31 PM

టీసీఎస్కు భారీ ఫైన్.. - Sakshi

టీసీఎస్కు భారీ ఫైన్..

భారతదేశం నుంచి సర్వీసెస్ సెక్టార్లో ప్రథమంగా చెప్పుకునే కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్). ప్రపంచంలోని అన్ని దిగ్గజ కంపెనీలకు సర్వీసెస్ను అందించే టీసీఎస్కు యూఎస్ ఫెడరల్ కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది.

న్యూయార్క్\ముంబై: భారతదేశం నుంచి సర్వీసెస్ సెక్టార్లో ప్రథమంగా చెప్పుకునే కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్). ప్రపంచంలోని అన్ని దిగ్గజ కంపెనీలకు సర్వీసెస్ను అందించే టీసీఎస్కు యూఎస్ ఫెడరల్ కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. హెల్త్ కేర్కు సంబంధించిన సాఫ్ట్వేర్ను అనుమతి లేకుండా తీసుకున్నందుకు అమెరికాలో టాటాకు చెందిన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ను వెస్టర్న్ అమెరికాలోని విస్కన్సిన్ జిల్లాలో ఉన్న ఫెడరల్ కోర్టు ఎపిక్ సిస్టమ్స్కు 240 మిలియన్ డాలర్లను  చెల్లించాలని ఆదేశించింది.
 
ఈ సాఫ్ట్వేర్ తయారీ ప్రక్రియను 2012లో ఇరు కంపెనీలు ప్రారంభించాయి. ఒరేగాన్ కైసర్ పర్మనెంట్లోని కన్సల్టెంట్లను క్లయింట్లుగా ఎరిక్ సిస్టమ్స్ నియమించుకుంది. వీరు సాఫ్ట్వేర్కు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను ( వీటిలో 1,687 డాక్యుమెంట్లు ఎరిక్ సిస్టమ్స్కు చెందినవి) తీసుకున్నారు. ఈ కేసును రెండు వారాల పాటు విచారించిన ఫెడరల్ జడ్జి విలియం ఎమ్.కాన్లీ ఎరిక్ అనుమతి లేకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించుకున్నందుకు శిక్షగా 700 మిలియన్ డాలర్లు, నష్ట పరిహారంగా 240 మిలియన్ డాలర్లను టాటా ఇంటర్నేషనల్ ఎరిక్ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చారు.

తమ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకుని ప్రత్యర్ధి కంపెనీ మెడ్ మంత్ర అనే హెల్త్కేర్ సాఫ్ట్వేర్ను తయారుచేసుకున్నాయని ఎపిక్ ఆరోపిస్తోందని తెలిపారు. ఎపిక్కు చెందిన సమాచారాన్ని కైసర్ పర్మనెంటే కంపెనీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు టీసీఎస్కు చెందిన ఉద్యోగి ఆ సమాచారాన్ని మరో ఇద్దరు ఉద్యోగులతో పంచుకున్నారని కోర్టుకు తెలిపింది. కొన్నేళ్లుగా కష్టపడి తయారుచేసుకున్న సమాచారాన్ని టాటా కంపెనీయే ఉద్యోగుల నుంచి తస్కరించిందని ఎరిక్ ఆరోపిస్తోంది. దీనివల్ల మార్కెట్లో ఎపిక్ను నష్టపోయేలా చేయడం టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుందని తన 39 పేజీల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన ముంబై టీసీఎస్ అధికారి ఒకరు తమ ముందున్న ప్రశ్నలన్నింటికి కంపెనీ త్వరలో సమాధానం చెబుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement