శ్రీసిటీని సందర్శించిన తైవాన్ ప్రతినిధుల బృందం | Taiwan Delegation visited Sri City | Sakshi
Sakshi News home page

శ్రీసిటీని సందర్శించిన తైవాన్ ప్రతినిధుల బృందం

Aug 11 2015 12:23 AM | Updated on Sep 3 2017 7:10 AM

శ్రీసిటీని సందర్శించిన తైవాన్ ప్రతినిధుల బృందం

శ్రీసిటీని సందర్శించిన తైవాన్ ప్రతినిధుల బృందం

తైవాన్ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించింది...

సత్యవేడు: తైవాన్ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్ ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చర్స్ అసోసియేషన్( టీమా) అధ్యక్షుడు ఫ్రాన్సిస్ సయ్ ఆధ్వర్యంలో 20 మంది ప్రతినిధులు శ్రీసిటీకి వచ్చారు. శ్రీసిటీలో ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారిక సర్వే చేయడానికి వచ్చినట్లు బృందం సభ్యులు తెలిపారు.  శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. టీమా ప్రతినిధులు మొబిల్ట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో వైసీ కిమ్, ట్యోమ్ ఎలక్ట్రానిక్ వర్క్స్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్ సామ్యూట్‌కియో తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement