స్వల్ప లాభాల్లో కీలక సూచీలు  | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాల్లో కీలక సూచీలు 

Published Tue, Apr 17 2018 9:43 AM

stockmarkets  in marginal gains - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. గ్లోబల్‌ మార్కెట్లు నెగిటివ్‌  ఉన్నప‍్పటికీ మన  ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అయితే పీఎస్‌యూ బ్యాంకింగ్‌ సెక్టార్లో వీక్‌నెస్‌ కొనసాగుతోంది. సెన్సెక్స్‌  40 పాయింట్ల లాభంతో, నిఫ్టీ9 పాయింట్ల లాభంతో మొదలయ్యాయి. అయితే  ప్రస్తుతం ఇన్వెస్టర్ల అమ్మకాలతో  స్వల్ప నష్టాల్లోకి మళ్లాయి. లాభనష్టాల మధ్య ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని , బ్యాంక్‌ నిఫ్టీని  గమనించాల్సి ఉందని  ఎనలిస్టుల విశ్లేషణ.  మెటల్‌, ఆటో రంగాలు  లాభపడుతుండగా , ఐటీ  షేర్లు నష్టాల్లో  కొనసాగుతున్నాయి.

ఎస్‌బీఐ, వర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌, సిప్లా , ఇండియా బుల్స్‌ వెంచర్స్‌, టాటా మోటార్స్‌  హిందాల్కో, నాల్కో,  అపోలో టైర్స్‌, ఐడియా, ఎంఅండ్‌ఎం, లుపిన్‌, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌, ఐవోసీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌  లాభపడుతుండగా, ఎస్‌బ్యాంక్‌,  ఫోర్టిస్‌, హెచ్‌పీసీఎల్‌,ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌, గ్రాసిమ్‌, విప్రో, జీ, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్, మారుతీ, ఇన్‌ఫ్రాటెల్‌, టైటన్‌   తదితర షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు  టైర్‌ షేర్లలాభపడుతున్నాయి. ముఖ్యంగా టైర్‌  సెక్టార్‌ దిగ్గజం ఎంఆర్‌ఆఫ్‌  మరోసారి రికార్డ్‌ స్థాయిని తాకింది. 

Advertisement
Advertisement