కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు | Stock Market Tumbles Over weak Global Cues | Sakshi
Sakshi News home page

భారీగా నష్టపోతున్న స్టాక్‌మార్కెట్లు

Aug 5 2019 10:01 AM | Updated on Aug 5 2019 10:07 AM

Stock Market Tumbles Over weak Global Cues - Sakshi

నష్టాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

ముంబై : గ్లోబల్‌ మార్కెట్ల డౌన్‌ట్రెండ్‌తో సోమవారం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్‌ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులతో మదుపుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 600 పాయింట్ల పైగా నష్టంతో 36,456 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 10,813 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement