స్నాప్డీల్ మరోవిడత ఫెస్టివల్ సేల్స్ | Snapdeal sees a revival during festival season sales | Sakshi
Sakshi News home page

స్నాప్డీల్ మరోవిడత ఫెస్టివల్ సేల్స్

Oct 11 2016 12:17 AM | Updated on Jun 4 2019 6:34 PM

స్నాప్డీల్ మరోవిడత ఫెస్టివల్ సేల్స్ - Sakshi

స్నాప్డీల్ మరోవిడత ఫెస్టివల్ సేల్స్

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ఈ నెల 12 నుంచి 14 వరకు మరోసారి పండుగ విక్రయాలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.

రేపటి నుంచి మూడు రోజులు
ఎస్‌బీఐ కార్డులపై 10 శాతం తగ్గింపు

 న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ఈ నెల 12 నుంచి 14 వరకు మరోసారి పండుగ విక్రయాలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యర్థి సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లకు దీటుగా స్నాప్‌డీల్ ‘అన్‌బాక్స్ దివాళీ’ పేరుతో ఈ నెల 2-6 తేదీల మధ్య పండుగ తగ్గింపు విక్రయాలను చేపట్టింది. ఈ సందర్భంగా 11 మిలియన్ల ఉత్పత్తులను విక్రయించినట్టు ప్రకటించింది. భారీ స్పందనకుతోడు పండుగ వాతావరణంలో నేపథ్యంలో మరోసారి పెద్ద ఎత్తున విక్రయాలకు ముందుకు వచ్చింది.

ఈ నెల 12-14 తేదీల మధ్య కొనుగోళ్లకు ఎస్‌బీఐ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు పొందవచ్చని సంస్థ తెలిపింది. అలాగే, ఐఫోన్7, ఐఫోప్7 ప్లస్ మోడళ్లను అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.10వేలు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. కాగా, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ సంస్థలు సైతం దిపావళి పండుగ లోపు మరోసారి తగ్గింపు విక్రయాలు చేపట్టే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement