ఈ చిన్న షేర్లకు స్పీడ్‌ లిమిట్‌ లేదు!

Small caps jumps with volumes in volatile market - Sakshi

20-10 శాతం ఎగసిన స్మాల్‌ క్యాప్స్‌

భారీగా పెరిగిన ట్రేడింగ్‌ పరిమాణం

ఆటుపోట్ల మధ్య మార్కెట్లు

స్వల్ప లాభాలతో ఇండెక్సులు

సానుకూల ప్రపంచ సంకేతాలతో మూడో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ ఒడిదొడుకులను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 40 పాయింట్ల స్వల్ప లాభంతో 34,411కు చేరగా.. నిఫ్టీ 10 పాయింట్లు బలపడి 10,177 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన చిన్న షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో ఐటీడీసీ లిమిటెడ్‌, ఎస్‌ఎంఎస్‌ లైఫ్‌సైన్సెస్‌, మురుడేశ్వర్‌ సిరామిక్స్‌, హిందుస్తాన్‌ నేషనల్‌ గ్లాస్‌, అగర్వాల్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ చోటు సాధించాయి.

ఐటీడీసీ లిమిటెడ్‌
టూరిజం డెవలప్‌మెంట్‌ రంగ ఈ పీఎస్‌యూ షేరు అమ్మేవాళ్లు తక్కువకాగా.. కొనేవాళ్లు అధికమై ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 21 ఎగసి రూ. 227 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 1,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

ఐబీ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌
ఇండియాబుల్స్‌ గ్రూప్‌లోని ఈ కంపెనీ షేరు అమ్మేవాళ్లు తక్కువకాగా..ఎన్‌ఎస్‌ఈలో కొనేవాళ్లు అధికమై 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 4 ఎగసి రూ. 43 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 39,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 40,500 షేర్లు ట్రేడయ్యాయి.

ఎస్‌ఎంఎస్‌ లైఫ్‌సైన్సెస్‌
హెల్త్‌కేర్‌ రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో అమ్మేవాళ్లు తక్కువకాగా.. కొనేవాళ్లు అధికమై 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 55 ఎగసి రూ. 332 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 700 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 3,500 షేర్లు చేతులు మారాయి.

మురుడేశ్వర్‌ సిరామిక్స్‌
సిరామిక్స్‌, విట్రిఫైడ్‌ టైల్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో అమ్మేవాళ్లు తక్కువకాగా.. కొనేవాళ్లు అధికమై 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 3.4 ఎగసి రూ. 20.5 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 14,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 2.63 లక్షల షేర్లు చేతులు మారాయి.

హిందుస్తాన్‌ నేషనల్‌ గ్లాస్‌
గ్లాస్‌ కంటెయినర్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో అమ్మేవాళ్లు తక్కువకాగా.. కొనేవాళ్లు అధికమై 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 7.7 ఎగసి రూ. 46.3 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 2,100 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 17,500 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top