
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో బలహీనంగా ప్రారంభమైనాయి. ప్రపంచ మార్కెట్లు కూడా ఇదే ధోరణిలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్‌లో సెన్సెక్స్ 1 పాయింట్ క్షీణించి 38,362వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు బలహీనపడి 11,524 వద్ద ట్రేడవుతోంది. తద్వారా వరుసగా ఏడు రోజులు లాభాల పరుగుకు బ్రేక్ పడింది. లాభాల స్వీకరణ ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
రియల్టీ అత్యధికంగా 2 శాతం పుంజుకోగా.. ఐటీ 1 శాతం బలపడింది. అయితే మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్ నష్టపోతున్నాయి. రియల్టీ స్టాక్స్‌లో ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్, ఒబెరాయ్, ఫీనిక్స్ 3-1 శాతం మధ్య లాభపడుతుండగా, మీడియా కౌంటర్లలో జీ, డిష్ టీవీ, యుఫో, జీ మీడియా, జాగరణ్, ఐనాక్స్ లీజర్, టీవీ 18, ఈరోస్, డీబీ కార్ప్ నష్టపోతున్నాయి.
మరోవైపు ఐబీ హౌసింగ్, ఇన్ఫోసిస్, హిందాల్కో, విప్రో, వేదాంతా, ఇన్‌ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ టాప్ విన్నర్స్‌గా కొనసాగుతుండగా, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, కొటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టాలతో కొనసాగుతున్నాయి.