
ముంబై : బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో ఆద్యంతం ఒడిదుడుకులుగా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్పలాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 26.53 పాయింట్లు లాభపడి 33,588 వద్ద, నిఫ్టీ 6.45 పాయింట్ల లాభంలో 10,348 వద్ద క్లోజయ్యాయి. ఐటీ స్టాక్స్ ర్యాలీ కొనసాగించగా.. ఇన్సూరెన్స్ స్టాక్స్ 3-6 శాతం మేర కిందకి పడిపోయాయి. రెండు సూచీల్లోనూ టాప్ గెయినర్లుగా బీహెచ్‌ఈఎల్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మాలు లాభాలు పండించగా.. డీఆర్‌ఎల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ నష్టాలు గడించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 24పైసల బలపడి 64.69గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 107 రూపాయల నష్టంలో రూ.29,423గా ఉన్నాయి.