
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం, రియల్టీపై జీఎస్‌టీ తగ్గింపు వంటి సానుకూల అంశాలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 36వేల పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి 36,068వద్ద, నిఫ్టీ సైతం 33 పాయింట్లు బలపడి 10,841 వద్ద ట్రేడవుతోంది. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారంపై ప్రెసిడెంట్ ట్రంప్ ఆసక్తి చూపడంతో శుక్రవారం అమెరికా స్టాక్మార్కెట్లు పుంజుకున్నాయి.
పీఎస్‌యూ బ్యాంక్స్ తప్ప దాదాపు అన్ని రంగాలూ లాఢభపడుతున్నాయి. ముఖ్యంగా ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, ఐటీ, పార్మా, రియల్టీ రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, హీరోమోటొ, సన్ ఫార్మా, టీసీఎస్, యస్ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఐటీసీ, బజాజ్ ఆటో టాప్ విన్నర్స్‌గా ఉండగా అదానీ పోర్ట్స్ 8 శాతం పతనమైంది. అలాగే ఇన్‌ఫ్రాటెల్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, వేదాంతా, ఐబీ హౌసింగ్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌పీసీఎల్ తదితరాలు నష్టపోతున్నాయి.