
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లలో బుల్ దౌడు కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు కూడా కీలక సూచీలు భారీ లాభాలతో ఉత్సాహంగా ముగిసాయి. సెన్సెక్స్ 217 పాయింట్లు ఎగిసి 37,6752 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 11341 వద్ద రికార్డు స్థాయిలతో స్థిరంగా ముగిసాయి. ఐటీ, ఫార్మా, మిడ్‌క్యాప్‌లు మాత్రమే నెగిటివ్‌గా ముగిసాయి. దాదాపు మిగిలిన అన్ని సెక్టార్లు పాజిటివ్‌గా ముగిసాయి. ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు వరుసగా మూడో రోజు రికార్డుల మోత మోగించింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ , ఐసీఐసీఐ తదితరాలు రికార్డు గరిష్టాలను నమోదు చేయడం గమనార్హం.
యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు టాప్ గెయినర్‌లుగా నిలిచాయి. మరోవైపు వేదాంత, భారతి ఎయిర్‌టెల్, ఇండియన్ ఆయిల్, నాల్కో, ఐడీబీఐ, జీ ఎంటర్ టెయిన్‌మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు టాప్ లూజర్స్‌గా ముగిసాయి.