సెన్సెక్స్‌ 32,170 మద్దతుకు ఇటూ...అటూ

Sensex 32170 up and down - Sakshi

మార్కెట్‌ పంచాంగం

అమెరికాతో పాటు పలుదేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని పాక్షికంగా తెరిచినందున ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ గతవారం ప్రథమార్ధంలో జోరుగా ర్యాలీ జరిపినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...తిరిగి చైనాతో ట్రేడ్‌వార్‌ను తెరపైకి తేవడంతో ఆ మార్కెట్లన్నీ వారాంతంలో హఠాత్‌ పతనాన్ని చవిచూసాయి. భారత్‌ మార్కెట్‌కు శుక్రవారం సెలవుకావడంతో ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఇక్కడ పడలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్‌జోన్లు అయినందున, మరో రెండు వారాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా వుండిపోతుంది. అటు అంతర్జాతీయ అంశాలు, ఇటు దేశీయ వార్తల ప్రతికూలతను భారత్‌ మార్కెట్‌ తట్టుకోవాలంటే..కేంద్రం కొద్దిరోజులుగా తాత్సారం చేస్తున్న ఆర్థిక ప్యాకేజీని తక్షణమే ప్రకటించాల్సివుంటుంది. అది ఇన్వెస్టర్లను మెప్పించాల్సివుంటుంది.  ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఏప్రిల్‌ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అనూహ్యంగా  33,887 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత, అంతక్రితంవారంతో పోలిస్తే 2391 పాయింట్ల భారీలాభంతో 33,718 పాయింట్ల వద్ద ముగిసింది.  గత గురు, శుక్రవారాల్లో యూరప్, అమెరికా మార్కెట్లు పతనమైన నేపథ్యంలో ఈ సోమవారం సెన్సెక్స్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 32,170 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది.  ఈ లోపున 31,660–31,275 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి మద్దతు లభ్యమవుతున్నది. ఈ శ్రేణిని కోల్పోతే ఏప్రిల్‌ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 30,750 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.  ఈ సోమవారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే క్రమేపీ 33,880 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపైన ముగిస్తే 34,100 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 34,900 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్‌ వుంటుంది.  

నిఫ్టీ 9,390 మద్దతు కోల్పోతే...
క్రితం వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ...గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన రైజింగ్‌ వెడ్జ్‌ ప్యాట్రన్‌ అప్పర్‌బ్యాండ్‌ అయిన 9,500 పాయింట్ల స్థాయిని ఛేదించినంతనే 9,889 పాయింట్ల గరిష్టస్థాయికి శరవేగంగా ర్యాలీ జరిపింది. ఈ స్థాయి 12,430 పాయింట్ల గరిష్టం నుంచి 7,511 పాయింట్ల కనిష్టంవరకూ జరిగిన పతనానికి 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి.  వచ్చేవారం సైతం ఈ స్థాయిని పరిరక్షించుకుంటేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది. ఈ సోమవారం మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 9,390 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 9,260–9,140 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 8,980 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. 7,511 పాయింట్ల నుంచి 9,889 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 8,980 పాయింట్ల స్థాయిని కోల్పోతే నిఫ్టీ ప్రస్తుత రిలీఫ్‌ర్యాలీకి తెరపడినట్లే. అయితే ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే మరోదఫా 9,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 9,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 10,200 వరకూ కూడా పెరిగే చాన్స్‌ వుంటుంది.

– పి. సత్యప్రసాద్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-01-2021
Jan 22, 2021, 14:11 IST
మానసిక సమస్యల కారణంగా పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు
22-01-2021
Jan 22, 2021, 13:24 IST
చెన్నై: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని...
22-01-2021
Jan 22, 2021, 10:14 IST
ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల జాబితా ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం రెండు లక్షల మందికిపైగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఉంటారని అంచనా వేశారు.
22-01-2021
Jan 22, 2021, 08:38 IST
ఇలాంటి సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సిద్ధం కావడం, ఉద్యోగులపై ఎన్నికల విధుల భారం మోపడం...
22-01-2021
Jan 22, 2021, 08:10 IST
కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం మంగోలియా దేశంలో వచ్చింది.
22-01-2021
Jan 22, 2021, 04:15 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై/బెంగళూరు: జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి...
22-01-2021
Jan 22, 2021, 02:07 IST
శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో కరోనా టీకా వేయించుకున్న ప్రముఖ ప్రైవేటు వైద్యుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది. జేపీ...
22-01-2021
Jan 22, 2021, 01:53 IST
న్యూఢిల్లీ: రెండో విడత వ్యాక్సినేషన్‌లో 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రజా ప్రతినిధులకు టీకా వేసే అవకాశముంది. ప్రధాని నరేంద్రమోదీ,...
21-01-2021
Jan 21, 2021, 20:32 IST
ఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా గత ఆరు రోజులుగా సాగుతున్న వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో 9,99,065 మందికి...
21-01-2021
Jan 21, 2021, 18:50 IST
హైదరాబాద్‌: కరోనా మహమ్మారికి సంబంధించిన 24 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత...
21-01-2021
Jan 21, 2021, 16:54 IST
వాషింగ్టన్‌:  పలు చోట్ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఆస్పత్రిపాలు అవుతుండటంతో జనాలు వ్యాక్సిన్‌ అంటేనే జంకుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవాలా? వద్దా? అని పునరాలోచనలో...
21-01-2021
Jan 21, 2021, 14:18 IST
సాక్షి, కరీంనగర్‌ : జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ వికటించి ఒకరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు జ్వరంతో ఇబ్బంది పడుతున్న అంగన్...
21-01-2021
Jan 21, 2021, 12:36 IST
విషయం ఏంటంటే పాజిటివ్‌ వచ్చిన వారిలో 69 మందికి వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ కూడా ఇచ్చారు
21-01-2021
Jan 21, 2021, 11:43 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాలు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీకా మొదట...
21-01-2021
Jan 21, 2021, 04:12 IST
పొదలకూరు: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరేసుకుని...
21-01-2021
Jan 21, 2021, 03:50 IST
సాక్షి, అమరావతి: నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 25,126 మందికి వ్యాక్సిన్‌...
20-01-2021
Jan 20, 2021, 11:50 IST
సెకండ్‌ డోస్‌ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు డాటా వెల్లడించింది
20-01-2021
Jan 20, 2021, 11:36 IST
టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కోవిడ్‌ అనుభవాలను  సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా...
20-01-2021
Jan 20, 2021, 09:23 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా...
20-01-2021
Jan 20, 2021, 08:43 IST
న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకోవడంపై సమాజంలో అపోహలు ఉన్నాయని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. మంగళవారం ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top