లాభాల స్వీకరణ: ఏడు రోజుల లాభాలకు బ్రేక్

 Senex Nifty Break 7-Day Winning Streak - Sakshi

సాక్షి, ముంబై:  ఫ్లాట్‌గాప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిసాయి.  వరుస ఏడు రోజుల లాభాలకు చెక్‌ చెప్పిన కీలక సూచీలు  ఒడిదొడుకుల మధ్య  రోజంతా కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 150పాయింట్లకుపైగా  పతనం కాగా,నిఫ్టీ 11900 స్థాయికి చేరింది. చివరికి సెన్సెక్స్‌ 54 పాయింట్లు క్షీణించి 40248 వద్ద, నిఫ్టీ 24పాయింట్ల బలహీనంతో 11917 వద్ద ముగిసాయి.  వరుసగా లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు  పేర్కొన్నారు. 

ప్రధానంగా  పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, మెటల్‌ బలపడగా.. మీడియా, ఐటీ  నష్టపోయాయి.  ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా రూ.87 కోట్ల   షేర్లను కొనుగోలు చేయడంతో  యస్‌ బ్యాంక్‌  9 శాతం జంప్‌చేయగా.. ఎస్‌బీఐ,  భారతి ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటర్స్‌,  వేదాంతా, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరో మోటో, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో లాభాలనార్జించాయి. జీ, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐషర్‌ మోటార్స్‌,  గ్రాసిం, కోటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ  నష్టపోయిన వాటిల్లో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు వాణిజ్య వివాద పరిష్కార అంచనాలతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు  భారీ లాభాలతో చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలవడం విశేషం! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top