టాప్‌–5లోకి ఎస్‌బీఐ | SBI's market value jumped to 60 thousand crores | Sakshi
Sakshi News home page

టాప్‌–5లోకి ఎస్‌బీఐ

Oct 26 2017 12:15 AM | Updated on Oct 26 2017 8:29 AM

SBI's market value jumped to 60 thousand crores

ఎస్‌బీఐ... మార్కెట్‌ విలువ పరంగా ఒక్క రోజులోనే ఐదు మెట్లెక్కేసింది. బుధవారం ఈ స్టాక్‌ ఏకంగా 27 శాతానికి పైగా లాభపడడంతో మార్కెట్‌ విలువ రూ.60,597 కోట్ల మేర పెరిగి రూ.2,80,282 కోట్లకు చేరుకుంది. దీంతో దేశీయంగా అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన ఐదో కంపెనీగా అవతరించింది. ఆర్‌ఐఎల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్‌ విలువలో హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి సుజుకి, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌ స్టాక్స్‌ను దాటుకుని ముందుకు వెళ్లింది. పీఎన్‌బీ మార్కెట్‌ విలువ ఒక్కరోజే రూ.12,789.68 కోట్లు పెరిగి రూ.42,963.68 కోట్లకు చేరింది. బీఓబీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10,380.28 కోట్లు వృద్ధితో రూ.43,364.28 కోట్లకు చేరింది.

ఇన్వెస్టర్ల సంపద రూ.1.96 లక్షల కోట్లు అప్‌
భారీ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా రూ.1.96 లక్షల కోట్ల మేర ఎగబాకింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ బుధవారం రూ.1,96,629.16కోట్ల వృద్ధితో రూ.1,41,79,644 కోట్లకు చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement