ఎస్బీఐ ఇన్టచ్ డెబిట్ కార్డులతో షాపింగ్ సులువు | SBI launches contactless debit and credit cards | Sakshi
Sakshi News home page

ఎస్బీఐ ఇన్టచ్ డెబిట్ కార్డులతో షాపింగ్ సులువు

Jul 16 2016 1:20 AM | Updated on Sep 4 2017 4:56 AM

ఎస్బీఐ ఇన్టచ్ డెబిట్ కార్డులతో షాపింగ్ సులువు

ఎస్బీఐ ఇన్టచ్ డెబిట్ కార్డులతో షాపింగ్ సులువు

ఎస్‌బీఐ ఇన్‌టచ్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు వినియోగదారులు ఇప్పుడు మరింత సులభంగా షాపింగ్ చేసుకోవచ్చు.

ముంబై: ఎస్‌బీఐ ఇన్‌టచ్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు వినియోగదారులు ఇప్పుడు మరింత సులభంగా షాపింగ్ చేసుకోవచ్చు. వీరు వారి కార్డులను బిగ్ బజార్, ఫుడ్ బజార్‌లలోని పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్స్ వద్ద ప్రజెంట్ చేస్తే.. ఎలాంటి పాస్‌వర్డ్‌లు అవసరం లేకుండానే వేగంగా, సులభంగా, భద్రంగా రూ.2,000 వరకు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. తొలి దశలో హైదరాబాద్ సహా మరో తొమ్మిది నగరాల్లోని బిగ్ బజార్, ఫుడ్ బజార్ ఔట్‌లెట్స్‌లో ఎస్‌బీఐ ఇన్‌టచ్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులను అంగీకరిస్తారని తెలిపింది. వీటిల్లో షాపింగ్ చేసే ఎస్‌బీఐ ఇన్‌టచ్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డుదారులకు రూ.500ల విలువైన లావాదేవీలపై 10%క్యాష్‌బ్యాక్ పొందొచ్చని పేర్కొంది. నెలలో గరిష్టంగా రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని పొందొచ్చని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement