అమెజాన్‌తో ఎస్‌బీఐ ఒప్పందం | SBI inks pact with Amazon for payment, commerce solutions | Sakshi
Sakshi News home page

అమెజాన్‌తో ఎస్‌బీఐ ఒప్పందం

May 21 2015 12:56 AM | Updated on Aug 28 2018 8:11 PM

అమెజాన్‌తో ఎస్‌బీఐ ఒప్పందం - Sakshi

అమెజాన్‌తో ఎస్‌బీఐ ఒప్పందం

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌తో ఎస్‌బీఐ ఒప్పందం కుదుర్చుకుంది.

ముంబై: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌తో  ఎస్‌బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఖాతాదారులు, తమ బ్యాంక్ శాఖల్లో ఖాతాలున్న చిన్న వ్యాపారుల కోసం చెల్లింపు, కామర్స్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఎస్‌బీఐ తెలిపింది. డిజిటల్ కామర్స్ రంగంలో అమెజాన్ అతి పెద్ద కంపెనీ అని, తమకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులున్నారని, ఈ ఒప్పందం కారణంగా తమ ఖాతాదారులకు మంచి ప్రయోజనాలు దక్కుతాయని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు.

ఈ ఒప్పందంలో భాగంగా అమెజాన్‌కు ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్‌ఎంఈ ఖాతాదారులకు రుణాలు కూడా అందిస్తామని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో తమ ఆర్థిక ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయించాలని కూడా యోచిస్తున్నామన్నారు. ఈ తరహా ఒప్పందాలను ఇతర ఈ-కామర్స్ సంస్థలతో కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.  ఎస్‌బీఐ వంటి దిగ్గజ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement