సాన్సూయ్ నుంచి 10 కొత్త టీవీ మోడళ్లు | Sansui Backs KKR Contest, Chance To Win Exciting Prizes | Sakshi
Sakshi News home page

సాన్సూయ్ నుంచి 10 కొత్త టీవీ మోడళ్లు

Apr 27 2016 1:10 AM | Updated on Sep 3 2017 10:49 PM

సాన్సూయ్ నుంచి 10 కొత్త టీవీ మోడళ్లు

సాన్సూయ్ నుంచి 10 కొత్త టీవీ మోడళ్లు

: జపాన్‌కు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సాన్‌సూయ్ భారత్‌లో 10 కొత్త టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్: జపాన్‌కు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సాన్‌సూయ్ భారత్‌లో 10 కొత్త టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు సార్లు ఐపీఎల్ చాంపియన్లుగా అవతరించిన కోల్‌కతా నైట్ రైడర్ల(కేకేఆర్)తో తామ మూడేళ్ల భాగస్వామ్య అనుబంధాన్ని పురస్కరించుకొని ఈ కొత్త టీవీ మోడళ్లు... 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ, స్మార్ట్ కనెక్ట్ టీవీ, ఫుల్ హెచ్‌డీ టీవీలను ను భారత్‌లో ప్రవేశపెట్టామని సాన్‌సూయ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ టీవీలను  కేకేఆర్ ఆటగాళ్లు.. గౌతమ్ గంభీర్, మోర్నె మోర్కెల్, యుసుఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, బ్రాడ్ హగ్, ఆండ్రె రస్సెల్‌ను ఆవిష్కరించారని సాన్‌సూయ్ సీఓఓ అమితాబ్ తివారీ పేర్కొన్నారు.         ఈ ఏడాది 10 లక్షల ఫ్లాట్ ప్యానెల్ టీవీలను విక్రయించాలని, 10 శాతం మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యాలుగా పెట్టుకున్నామని తెలిపారు. సాన్‌సూయ్ కర్వ్ 4కే ఎల్‌ఈడీ టీవీ(165 సెం.మీ.) ధర రూ.2,70,000 అని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement