12 కోట్ల శాంసంగ్‌ టీవీ!! | Samsung Launches New TV With A Massive 293 Inch Screen | Sakshi
Sakshi News home page

292 అంగుళాల ‘ది వాల్‌’  

Dec 6 2019 1:03 AM | Updated on Dec 6 2019 2:21 PM

Samsung Launches New TV With A Massive 293 Inch Screen - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ తాజాగా భారీ స్క్రీన్‌లతో ’ది వాల్‌’ టీవీల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఇవి 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల స్క్రీన్‌తో లభిస్తాయి. వీటి ధర రూ. 3.5 కోట్ల నుంచి రూ. 12 కోట్ల దాకా ఉంటుంది. విలాసవంతమైన అనుభూతి కోరుకునే వారి కోసం వీటిని రూపొందించినట్లు శాంసంగ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ విభాగం) పునీత్‌ సేఠి తెలిపారు.

దేశీయంగా అత్యంత సంపన్న వర్గాలు లక్ష్యంగా ఈ టీవీలు ఆవిష్కరించినట్లు వివరించారు. 2022 నాటికి 200 యూనిట్లు విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ది వాల్‌ శ్రేణి టీవీలు.. తెరను బట్టి మైక్రో ఎల్‌ఈడీ, 6కే డెఫినిషన్, 8 కే డెఫినిషన్‌లలో ఉంటాయి. టీవీ చూడనప్పుడు కట్టేయాల్సిన అవసరం లేకుండా.. పెయింటింగ్‌లు, ఫొటోలు వంటివి డిస్‌ప్లే చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement