ప్రపంచంలోనే తొలి 8కే టీవీ, ధర వింటే.. | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలి 8కే టీవీ, ధర వింటే..

Published Wed, Jun 5 2019 3:16 PM

Samsung introduces ultra premium QLED 8K TV ranging Rs 10.99 lakh to Rs 59.99 lakh     - Sakshi

శాంసంగ్‌ సరికొత్త టీవీలను లాంచ్‌ చేసింది. అధునాతన టెక్నాలజీతో ప్రీమియం కస్టమర్లకోసం ఖరీదైన టీవీలను మంగళవారం ఆవిష్కరించింది. అ‍ల్ట్రా ప్రీమియం క్యూఎల్‌ఈడీ 8కె టీవీపేరుతో ఈ స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ. 10.99 లక్షలనుంచి రూ. 59.99 లక్షల మధ్య ఉండనున్నాయి. పూర్తి హెచ్‌డీ తెరలతో పోలిస్తే 33 మిలియన్స్‌ పిక్సెల్స్‌తో 16 రెట్ల స్పష్టత,  క్లారిటీ వుంటుందని కంపెనీ చెబుతోంది.  బిగ్‌ స్క్రీన్ల కు పెరుగుతున్న ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో  అత్యంత స్పష్టత కలిగిన క్యూఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించింది.  ప్రపంచంలోనే తొలిసారిగా క్వాంటమ్‌ ప్రాసెసర్‌తో పనిచేసే 8కే రిజల్యూషన్‌ కలిగిన ఎల్‌ఈడీ టీవీలను తీసుకొచ్చింది.

75 అంగుళాల  క్యూఎల్‌ఈడీ 8కే  టీవీ ధర రూ. రూ.10.99,900 
82 అంగుళాల  క్యూఎల్‌ఈడీ 8కే ధర  ష్త్ర రూ.16,99,990 
98 అంగుళాల క్యూఎల్‌ఈడీ 8కే టీవీ ధర రూ. రూ.59, 99 900
గా నిర్ణయించింది. అయితే ముందస్తు ఆర్డర్లపై  మాత్రమే 98 అంగుళాల టీవీలను తయారు చేస్తామని తెలిపింది. అలాగే  65 అంగుళాల టీవీ ధరను త్వరలోనే వెల్లడిస్తామంది. 
 
విలాసవంత గృహాలకు తగిన విధంగా క్యూఎల్‌ఈడీ టీవీలను విడుదల చేస్తున్నామని శాంసంగ్‌ ఇండియా కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లన్‌  వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4కే యూహెచ్‌డీ తెరలతో పోలిస్తే 4 రెట్లు స్పష్టత వుంటుందన్నారు. అలాగే టీవీల  మార్కెట్‌లో శాంసంగ్‌  వాటా 30 శాతంగా ఉందనీ, , వచ్చే పండుగల సీజన్‌ (అక్టోబరు-నవంబరు)కు దీన్ని 34 శాతానికి పెంచుకోవాలనేది లక్ష్యమని  పేర్కొన్నారు. 

Advertisement
Advertisement