breaking news
QLED TV
-
ప్రపంచంలోనే తొలి 8కే టీవీ, ధర వింటే..
శాంసంగ్ సరికొత్త టీవీలను లాంచ్ చేసింది. అధునాతన టెక్నాలజీతో ప్రీమియం కస్టమర్లకోసం ఖరీదైన టీవీలను మంగళవారం ఆవిష్కరించింది. అల్ట్రా ప్రీమియం క్యూఎల్ఈడీ 8కె టీవీపేరుతో ఈ స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ. 10.99 లక్షలనుంచి రూ. 59.99 లక్షల మధ్య ఉండనున్నాయి. పూర్తి హెచ్డీ తెరలతో పోలిస్తే 33 మిలియన్స్ పిక్సెల్స్‌తో 16 రెట్ల స్పష్టత, క్లారిటీ వుంటుందని కంపెనీ చెబుతోంది. బిగ్ స్క్రీన్ల కు పెరుగుతున్న ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత స్పష్టత కలిగిన క్యూఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్వాంటమ్ ప్రాసెసర్‌తో పనిచేసే 8కే రిజల్యూషన్ కలిగిన ఎల్ఈడీ టీవీలను తీసుకొచ్చింది. 75 అంగుళాల క్యూఎల్ఈడీ 8కే టీవీ ధర రూ. రూ.10.99,900 82 అంగుళాల క్యూఎల్ఈడీ 8కే ధర ష్త్ర రూ.16,99,990 98 అంగుళాల క్యూఎల్ఈడీ 8కే టీవీ ధర రూ. రూ.59, 99 900 గా నిర్ణయించింది. అయితే ముందస్తు ఆర్డర్లపై మాత్రమే 98 అంగుళాల టీవీలను తయారు చేస్తామని తెలిపింది. అలాగే 65 అంగుళాల టీవీ ధరను త్వరలోనే వెల్లడిస్తామంది. విలాసవంత గృహాలకు తగిన విధంగా క్యూఎల్ఈడీ టీవీలను విడుదల చేస్తున్నామని శాంసంగ్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4కే యూహెచ్డీ తెరలతో పోలిస్తే 4 రెట్లు స్పష్టత వుంటుందన్నారు. అలాగే టీవీల మార్కెట్లో శాంసంగ్ వాటా 30 శాతంగా ఉందనీ, , వచ్చే పండుగల సీజన్ (అక్టోబరు-నవంబరు)కు దీన్ని 34 శాతానికి పెంచుకోవాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. -
బంపర్ ఆఫర్: టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్ ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ పండుగ సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ ఉత్పత్తుల కొనుగోలుపై వి నియోగదారులకు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్ ఈ ఆఫర్లు వర్తిస్తాయి. శామ్సంగ్ స్మార్ట్ ఉత్సవ్ పేరుతో నేటి (బుధవారం) నుంచే ప్రారంభమవుతాయని శాంసంగ్ ప్రకటించింది. అక్టోబర్ 22 వరకు ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల వెల్లువ సాగనుంది. కచ్చితమైన బహుమతులు, వారంటీ స్కీం, సులభమైన ఈఎంఐలు , ఎంపిక చేసిన ఉత్పత్తులపై జీరో డౌన్ పేమెంట్ (ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా) అందిస్తోంది. ఎస్బీఐ డెబిట్ ద్వారా జరిపిన కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. వీటన్నింటికి మించి ఓ ఆసక్తికరమైన ఆఫర్ కూడా ఉంది. ఎంపిక చేసిన శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీ కొన్న వారికి 128 జీబీ స్టోరేజ్ , రూ.70,900 ఖరీదు చేసే ప్రీమియం శాంసంగ్ గెలాక్స్ ఎస్ 8 ప్లస్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అలాగే 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్ వారంటీ తోపాటు, రూ.10వేల విలువ చేసే నో గ్యాప్ వాల్ మౌంట్ ఉచితం. యూహెచ్డీ టీవీ లేదా కర్వ్డ్ టీవీ కొంటే.. రూ. 23,990 విలువే చేసే సౌండ్ బార్ పూర్తిగా ఉచితం. శాంసంగ్ సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొంటే గెలాక్సీ జే 5 ప్రైమ్(ధర రూ.13,490, లేదా గెలాక్సీ జే 2 ప్రొ (రూ.9.090) ఉచితం.