బంపర్‌ ఆఫర్‌: టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్‌ ఫ్రీ | Samsung Smart Utsav: Galaxy S8+ free with QLED TV and other offers | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌: టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్‌ ఫ్రీ

Sep 20 2017 8:05 PM | Updated on Sep 22 2017 6:44 PM

బంపర్‌ ఆఫర్‌: టీవీ  కొంటే స్మార్ట్‌ఫోన్‌ ఫ్రీ

బంపర్‌ ఆఫర్‌: టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్‌ ఫ్రీ

కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ పండుగ సందర్భంగా వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

సాక్షి, న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం  శాంసంగ్‌ పండుగ సందర్భంగా వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  శాంసంగ్‌ ఉత్పత్తుల కొనుగోలుపై వి నియోగదారులకు భారీ ఆఫర్లు,  డిస్కౌంట్లను అందిస్తోంది.  టీవీలు,  రిఫ్రిజిరేటర్లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్  ఈ ఆఫర్లు వర్తిస్తాయి. శామ్సంగ్ స్మార్ట్  ఉత్సవ్‌ పేరుతో  నేటి (బుధవారం) నుంచే ప్రారంభమవుతాయని శాంసంగ్‌ ప్రకటించింది. అక్టోబర్ 22 వరకు ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల వెల్లువ సాగనుంది. 

కచ్చితమైన బహుమతులు, వారంటీ స్కీం,  సులభమైన ఈఎంఐలు , ఎంపిక చేసిన  ఉత్పత్తులపై  జీరో డౌన్‌ పేమెంట్‌   (ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా) అందిస్తోంది. ఎస్‌బీఐ డెబిట్‌ ద్వారా జరిపిన కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌  ఉంది.  వీటన్నింటికి మించి ఓ ఆసక్తికరమైన ఆఫర్‌  కూడా ఉంది.

ఎంపిక చేసిన శాంసంగ్‌ క్యూఎల్‌ఈడీ టీవీ  కొన్న వారికి 128 జీబీ స్టోరేజ్‌ , రూ.70,900  ఖరీదు చేసే  ప్రీమియం శాంసంగ్‌  గెలాక్స్‌ ఎస్‌ 8 ప్లస్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. అలాగే  10 సంవత్సరాల  నో  స్క్రీన్‌ బర్న్‌ వారంటీ తోపాటు, రూ.10వేల విలువ చేసే నో గ్యాప్‌ వాల్‌ మౌంట్‌  ఉచితం.

యూహెచ్‌డీ టీవీ లేదా కర్వ్‌డ్‌  టీవీ కొంటే..  రూ. 23,990 విలువే చేసే సౌండ్‌ బార్‌ పూర్తిగా ఉచితం.

శాంసంగ్‌ సైడ్‌ బై  సైడ్‌ ఫ్రిజ్‌ కొంటే  గెలాక్సీ  జే 5 ప్రైమ్‌(ధర రూ.13,490, లేదా  గెలాక్సీ జే  2 ప్రొ (రూ.9.090) ఉచితం.

 

Advertisement

పోల్

Advertisement