బిగ్‌ బ్యాటరీతో శాంసంగ్‌ ఎం31 | Samsung Galaxy M31  launched | Sakshi
Sakshi News home page

బిగ్‌ బ్యాటరీ, క్వాడ్‌ కెమెరా, శాంసంగ్‌ ఎం31

Feb 25 2020 2:37 PM | Updated on Feb 26 2020 7:38 AM

Samsung Galaxy M31  launched - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ ‘ఎం’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గత ఏడాది ఎం30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన శాంసంగ్‌.. దీనికి కొనసాగింపుగా తాజాగా ఎం31 పేరుతో ఒక  స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్‌​ చేసింది. రూ. 14999 ప్రారంభ ధరగా నిర్ణయించింది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ హై ఎండ్‌ మోడల్‌ ధర రూ. 15,999గా ఉంచింది.  మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్‌ ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయని శాంసంగ్‌ వెల్లడించింది. 

శాంసంగ్‌ గెలాక్సీ ఎం 31
6.40 అంగుళాల డిస్‌ప్లే
శాంసంగ్‌ ఎక్సినాస్‌ 9611 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌10
32ఎంపీ సెల్పీకెమెరా
64+ 8+ 5+ 5ఎంపీ రియర్‌ క్వాడ్‌కెమెరా
6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ 
6000 ఎంఏహెచ్‌  బ్యాటరీ

(చదవండి : రెండు సెల్ఫీ కెమెరాలు : రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్‌)

Advertisement
 
Advertisement
Advertisement