2.5 లక్షల కోట్ల పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి రాకపోవచ్చు: ఎస్బీఐ | Rs 2.5 lakh crore won't come back into banking system: SBI | Sakshi
Sakshi News home page

2.5 లక్షల కోట్ల పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి రాకపోవచ్చు: ఎస్బీఐ

Dec 3 2016 12:38 AM | Updated on Sep 4 2017 9:44 PM

2.5 లక్షల కోట్ల పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి రాకపోవచ్చు: ఎస్బీఐ

2.5 లక్షల కోట్ల పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి రాకపోవచ్చు: ఎస్బీఐ

పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో రూ.2.5 లక్షల కోట్ల విలువ గల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవచ్చని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది.

ముంబై: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో రూ.2.5 లక్షల కోట్ల విలువ గల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవచ్చని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. గత నెల 8న కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటి విలువ రూ.15.44 లక్షల కోట్లుగా అంచనా. గత నెల 27 వరకూ 8.27 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వచ్చాయని, మొత్తం మీద రూ.13 లక్షల కోట్లు వస్తాయని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. 2.5 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవచ్చని పేర్కొంది.

ఎస్‌బీఐ ఎకనామిక్  రీసెర్చ్  డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం.. 2016 మార్చి నాటికి పెద్ద కరెన్సీ నోట్ల విలువ రూ.14.18 లక్షల కోట్లు. వీటిని రద్దు చేసిన మరుసటి రోజున పెద్ద కరెన్సీ నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. మార్చితో పోల్చితే ఈ విలువ రూ.1.26 లక్షల కోట్లు అధికం. నవంబర్ 10-27  మధ్య రూ.8.44 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్/మార్పిడి అయ్యారుు. మొత్తం మీద రూ.13 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి వస్తారుు.

Advertisement
 
Advertisement
Advertisement