జియో జోష్‌: రిలయన్స్‌ , టెలికాం షేర్ల రింగింగ్‌ | RIL hits fresh all-time high; m-cap crosses Rs. 6 lakh cr mark | Sakshi
Sakshi News home page

జియో జోష్‌: రిలయన్స్‌ , టెలికాం షేర్ల రింగింగ్‌

Oct 23 2017 2:08 PM | Updated on Oct 23 2017 2:22 PM

RIL hits fresh all-time high; m-cap crosses Rs. 6 lakh cr mark

సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్  మరోసారి ఆల్‌ టైం హైని నమోదు చేసింది. మార్కెట్‌ క్యాప్‌ లో  రూ. 6 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది.  సోమవారం  రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 6లక్షలకోట్లను  దాటిన మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. రిలయన్స్‌ కు చెందిన టెలికాం కంపెనీ జియో తారిఫ్‌ లను భారీగా పెంచిన  నేపథ్యంలో ఈ రికార్డ్‌ సాధించింది.   ఆర్‌ఐ ఎల్‌ షేరు ధర రూ.936 వద్ద ట్రేడ్‌ అవుతూ మార్కెట్‌కు  పూర్తి మద్దతునిస్తోంది. 

జియో బ్రాండుతో టెలికం కంపెనీలకు ప్రధాన పోటీదారుగా నిలుస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇటీవల 4జీ టారిఫ్‌ ధరలను 15-20 శాతంమేర పెంచడం, వేలిడిటీ కాలాన్ని సైతం తగ్గించడం వంటి అంశాలు దీనికి దోహదం చేసినట్టు మార్కెట్‌ వర్గాలుభావిస్తున్నాయి.


మరోవైపు జియో తారిఫ్‌ రేట్ల  పెంపుజోష్‌తో, ఇటీవలి విలీనాలు టెలికాం షేర్లన్నీ మెరుపులు మెరిపించాయి.  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా టాప్‌ విన్నర్స్‌గా ఉండగా  రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కూడా లాభాల్లో కొనసాగుతోంది.  దీనికితోడు కామన్‌ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో నెట్‌వర్క్‌ను పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతుండటంతో టెలికం రంగంలో వ్యయాలు దిగిరానున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement