విదేశీ పెట్టుబడుల పరిమితులపై నోటిఫికేషన్ | Sakshi
Sakshi News home page

విదేశీ పెట్టుబడుల పరిమితులపై నోటిఫికేషన్

Published Fri, Jul 31 2015 12:55 AM

విదేశీ పెట్టుబడుల పరిమితులపై నోటిఫికేషన్ - Sakshi

న్యూఢిల్లీ : బ్యాంకింగ్, రక్షణ మినహా వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులపై సంయుక్త పరిమితులకు సంబంధించి చేసిన మార్పులు, చేర్పులపై కేంద్రం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం కమోడిటీ ఎక్స్చేంజీలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, పవర్ ఎక్స్చేంజీలు మొదలైన వాటిల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడుల విషయంలో ఉప-పరిమితులేమీ ఉండవు. ఆయా రంగాల్లో పోర్ట్‌ఫోలియో లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అన్నింటికీ కలిపి ఒకే పరిమితి ఉంటుంది.

అయితే, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌లో మాత్రం మొత్తం విదేశీ పెట్టుబడుల పరిమితి 74 శాతంగా ఉండగా, ఇందులో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ ఉప-పరిమితి 49 శాతంగా ఉంటుంది. అలాగే రక్షణ రంగంలోనూ ఆటోమేటిక్ మార్గంలో వచ్చే పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల పరిమితి 24 శాతంగా ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం దాకా విదేశీ పెట్టుబడులకు అనుమతులున్న రంగాలపై ఈ కొత్త పరిమితుల ప్రభావం ఉండబోదని పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement